ఆంధ్రా క్రికెటర్లకు ఏసీఏ హెచ్చరిక.. అనధికారిక టోర్నీలు ఆడితే కఠిన చర్యలు!
- అనధికార టోర్నీలు ఆడొద్దంటూ క్రికెటర్లకు ఏసీఏ హెచ్చరిక
- నిబంధనలు మీరితే కఠిన చర్యలు తప్పవని స్పష్టీకరణ
- తొలిసారిగా మూడు వేదికల్లో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ నిర్వహణ
- విశాఖ, కడప, మంగళగిరిలో ఏపీఎల్ మ్యాచ్‌ల సందడి
- కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా ఏపీఎల్ ప్రారంభం
ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) ఐదో సీజన్‌కు సన్నాహాలు జరుగుతున్న వేళ, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) తమ రిజిస్టర్డ్ క్రికెటర్లకు కీలక హెచ్చరిక జారీ చేసింది. తమ నుంచి ముందస్తు లిఖితపూర్వక అనుమతి లేకుండా ఎలాంటి అనధికారిక టోర్నమెంట్లలో పాల్గొనవద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు ఏసీఏ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
ఏసీఏ వద్ద రిజిస్టర్ అయిన ఆటగాళ్లు ఎవరైనా సరే, అనధికారిక క్రికెట్ టోర్నీలు లేదా ప్రైవేట్ మ్యాచ్‌లలో (టెన్నిస్ బాల్ క్రికెట్ లీగ్‌లతో సహా) పాల్గొనడంపై నిషేధం ఉందని ఏసీఏ తెలిపింది. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తమ వృత్తిపరమైన హోదాను కాపాడుకోవాలంటే నిబంధనలను తప్పక పాటించాలని సూచించింది.
ఇదిలా ఉండగా, ఏపీఎల్‌ను ఈసారి తొలిసారిగా మూడు వేదికల్లో నిర్వహించడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా క్రికెట్‌ను బలోపేతం చేయాలని ఏసీఏ లక్ష్యంగా పెట్టుకుంది. విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఏపీఎల్ పాలకమండలి ఛైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో యువ ప్రతిభను ప్రోత్సహించి, క్రికెట్ వ్యవస్థను పటిష్ఠం చేయడమే లీగ్ ముఖ్య ఉద్దేశమని ఆయన వివరించారు.
ఈ టోర్నీ జూన్ 9 నుంచి 14 వరకు విశాఖపట్నంలో, జూన్ 17 నుంచి 21 వరకు కడపలో, జూన్ 24 నుంచి 30 వరకు మంగళగిరిలో జరుగుతుందని ఆయన తెలిపారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరై టోర్నీని అధికారికంగా ప్రారంభిస్తారని వెల్లడించారు. భవిష్యత్తులో మరిన్ని మైదానాల్లో మ్యాచ్‌లు నిర్వహించి, ఆంధ్ర క్రికెట్‌ను మరింత పటిష్ఠం చేయాలనే లక్ష్యంతో ఏసీఏ ముందుకెళుతోంది.